Prashanth Neel-NTR Movie Shooting Update | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ‘అరవింద సమేత’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు ట్రిపుల్ఆర్తో ప్రేక్షకులను పలకరించాడు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో తారక్ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా హాలీవుడ్లో తారక్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే తారక్ తన నెక్స్ట్ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.
ఈ చిత్రం తర్వాత ప్రశాంత్‌నీల్‌తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన తారక్ పోస్టర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా అని అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. కాగా తాజాగా ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌పై ఓ మేజర్ అప్డేట్ను మీడియా ముందు వెల్లడించాడు. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా ఏప్రిల్, మే నెలలో ప్రారంభం కానుందని తెలిపాడు. ఈ అప్డేట్తో నందమూరీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్‌నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై నెట్టింట వైరల్ అవుతుంది.