Prakash Raj | పోలింగ్ రోజు సీసీ ఫుటేజి ఇవ్వండి.. ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ!
Prakash Raj | ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే వరకూ రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

హైదరాబాద్: ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే వరకూ రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సడెన్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులూ రాజీనామాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు. ‘మా’ పోలింగ్ సమయంలో మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.
చాలా విచక్షణారహితంగా మోహన్ బాబు ప్రవర్తన ఉందని విమర్శించారు. మోహన్ బాబు, నరేశ్ ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఆ దృశ్యాలు చూస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. ఆ సీసీ దృశ్యాలను మోహన్ బాబు తొలగించే అవకాశం ఉందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ క్రమంలో సీసీ కెమెరా దృశ్యాలను తమకు అందించాలని ఎన్నికల అధికారిని కోరారు.
సాధ్యమైనంత త్వరగా సీసీ ఫుటేజిలను తమకు అందించాలని తెలిపారు. పోలింగ్ రోజు మోహన్ బాబు, నరేశ్ బెదిరింపులకు దిగారని చెప్పారు. ప్రకాశ్ రాజ్ లేఖపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. పోలింగ్ రోజు నాటి సీసీ ఫుటేజిలు భద్రంగానే ఉన్నాయని, నిబంధనల ప్రకారం ఫుటీజ్ను ప్రకాశ్ రాజ్‌కు అందిస్తామని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

