Prabhas | థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో ప్రభాస్ సునామీ, ‘ది రాజా సాబ్’కు 17.5 మిలియన్ వ్యూస్
Prabhas | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ విడుదల చేసిన 2026 తొలి ఆరు నెలల నివేదికలో ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది.
Prabhas | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ విడుదల చేసిన 2026 తొలి ఆరు నెలల నివేదికలో ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, డిజిటల్ ప్లాట్ఫామ్లో మాత్రం ప్రేక్షకులు ఈ చిత్రానికి భారీ ఆదరణ చూపించారు. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ‘ది రాజా సాబ్’ ఏకంగా 17.5 మిలియన్ వ్యూస్ సాధించి, ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అత్యధికంగా వీక్షించిన సౌత్ సినిమా అనే ఘనతను సొంతం చేసుకుంది.
ఓర్మాక్స్ విడుదల చేసిన టాప్-10 జాబితాలో మలయాళ చిత్రాలు నాలుగు స్థానాలు దక్కించుకుని తమ సత్తా చాటగా, తెలుగు నుంచి ‘ది రాజా సాబ్’, ‘అగ్లీ స్టోరీ’, ‘అఖండ 2’, ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. తమిళం నుంచి ‘బ్లాస్ట్’, ‘యూత్’ సినిమాలు కూడా ఈ జాబితాలో నిలిచాయి. అయితే అన్ని చిత్రాలను వెనక్కి నెట్టి ప్రభాస్ సినిమా అగ్రస్థానంలో నిలవడం విశేషం.దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్-కామెడీ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు. థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా, ఓటీటీలో లభించిన ఈ భారీ ఆదరణ ప్రభాస్‌కు డిజిటల్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పింది.
థియేటర్లలో మిశ్రమ ఫలితం అందుకున్న సినిమా.. ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయి వ్యూస్ సాధించి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్ వంటి చిత్రాలు చేయనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

