Kalki 2 | ‘ఆల్ఫా’పై ప్రభాస్ ప్రశంసలు.. ‘కల్కి 2’ లో ఆలియా భట్ ఎంట్రీపై ఊహాగానాలు నిజమేనా?
Alia Bhatt In Kalki 2 | రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన తాజా సంభాషణ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Alia Bhatt In Kalki 2 | రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన తాజా సంభాషణ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలియా భట్, శర్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆల్ఫా’ (Alpha) ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆల్ఫా’ ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. ఈ ట్రైలర్ అద్భుతంగా, ప్రామిసింగ్‌గా ఉందని కొనియాడారు. అంతేకాకుండా ఆలియా భట్‌తో పాటు చిత్రబృందానికి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ప్రభాస్ చేసిన ఈ పోస్ట్‌పై స్పందించిన ఆలియా భట్.. దానిని రీ-షేర్ చేస్తూ థాంక్యూ, థాంక్యూ సో మచ్ అని కృతజ్ఞతలు తెలిపింది.
సాధారణంగా ప్రభాస్ ఇతర చిత్రాల ట్రైలర్లను అభినందించడం కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఆలియా సినిమాను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక ఒక పెద్ద కారణం ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్ (కల్కి 2) లో ఆలియా భట్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతోందని, అందుకే వీరిద్దరి మధ్య ఈ సాన్నిహిత్యం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన ఒక రహస్య షెడ్యూల్లో ఆలియా భట్ పాల్గొని, ప్రభాస్‌తో కలిసి కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌ను కూడా పూర్తి చేసిందని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. ఇక ‘ఆల్ఫా’ ట్రైలర్‌ను ప్రశంసించిన ప్రభాస్ పోస్ట్‌కు సమాధానంగా ఆలియా భట్ స్పందించిన తీరు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకవేళ ‘కల్కి 2’ లో ఆలియా భట్ ఎంట్రీ ఇస్తే మాత్రం, ఈ భారీ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

