Kalki 2898 AD | కాశీ రక్షకుడు భైరవ.. దేశవ్యాప్తంగా ఆసక్తినిరేకెత్తిస్తున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’
ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నిర్మాణం నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ హంగులతో దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Kalki 2898 AD | ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నిర్మాణం నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ హంగులతో దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం తాజా అప్డేట్ వెలువడింది. ‘భైరవ’గా ప్రభాస్ పాత్ర పేరును పరిచయం చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
‘కాశీ భవిష్యత్తు వీధుల నుంచి ‘భైరవ’ను పరిచయం చేస్తున్నాం’ అంటూ చిత్ర బృందం పేర్కొంది. ఇందులో ప్రభాస్ దృఢకాయంతో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో భవిష్యత్తు కాశీ నగరం కనిపిస్తున్నది. ప్రభాస్ డ్రెస్సింగ్ ైస్టెల్, లుక్స్ విభిన్నంగా కనిపిస్తున్నాయి. మహాభారత కాలంలో మొదలై 2898 వరకు ఈ చిత్ర కథ నడుస్తుందని, మైథాలజీ ఫిక్షన్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

