‘ఆదిపురుష్’ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. రాముడి గెటప్‌లో గూస్బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ లుక్.!
Adipurush Movie | ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'బాహుబలి' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' వంటి చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశ పడ్డాడు.
Adipurush Movie | ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశ పడ్డాడు. ప్రస్తుతం డార్లింగ్ ఆశలన్నీ ఆదిపురుష్ పైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్లో ప్రభాస్ రాముడి గెటప్‌లో అదిపోయాడు. ఒక చేతిలో బాణం, మరో చేతిలో విల్లును పట్టుకుని యుద్ధ వీరుడుగా కనిపిస్తున్నాడు. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రామాయణాన్ని బేస్ చేసుకుని ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతి కానుకుగా జనవరి 12న ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల రానున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.
मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम 🙏#Adipurush releases IN THEATRES on January 12, 2023 in IMAX & 3D!#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #Pramod #Vamsi #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @UV_Creations pic.twitter.com/CRKyFULchp
— UV Creations (@UV_Creations) October 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

