Prabhas | మోస్ట్ పాపులర్ టాలీవుడ్ స్టార్‌గా ప్రభాస్..!
Prabhas Ranked No.1 Place | 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో ప్రభాస్ కాస్త నిరాశచెందాడు.
Prabhas Ranked No.1 Place | ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో ప్రభాస్ కాస్త నిరాశచెందాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఆదిపురుష్’ సినిమాపైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవలే రిలీజైన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో మేకర్స్ వీఎఫ్ఎక్స్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ చిత్రాన్ని సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేశారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లుఅర్జున్, మహేష్‌బాబు తరువాతి స్థానాల్లో ఉన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో ఉండగా కాజల్ రెండవ స్థానంలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

