తేజేష్ రాజన్, ఐరా అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అమరం’. తిరుఅరుల్ కృష్ణన్ దర్శకుడు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. తూర్పు కనుమల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఎర్రచందనం స్మగ్లర్..ఓ యువతి చుట్టూ కథ నడుస్తుందని, స్మగ్లర్ల జీవన శైలి, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను ఈ సినిమా చూపిస్తుందని మేకర్స్ తెలిపారు.
ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని, ప్రేమకథ హార్ట్‌టచింగ్‌గా అనిపిస్తుందని దర్శకుడు తెలిపారు. జార్జ్ మరియన్, నాగినీడు, సాయిధీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, దర్శకత్వం: తిరుఅరుల్ కృష్ణన్.