Pottel Movie | తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ‘పొట్టేల్’.. ఉత్కంఠ రేపుతున్న టీజర్
Pottel Movie | వకీల్‌సాబ్ ఫేం, టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తాజాగా తంత్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకురాబోతుంది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel). యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.
Pottel Movie | వకీల్‌సాబ్ ఫేం, టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తాజాగా తంత్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకురాబోతుంది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel). యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బంధం రేగడ్’, ‘సవారీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకురి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, పాటలు తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర టీజర్‌ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
ఈ టీజర్ గమనిస్తే.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పల్లెటూరులో జరిగే కథలాగా అనిపిస్తుంది. పేద కుటుంబాన్ని అణచివేయాలని కంకణం కట్టుకున్న ఒక ధనిక వ్యక్తికి వ్యతిరేకంగా హీరో ఎలా పోరాడాడు. అసలు పొట్టేల్కు హీరోకి ఏంటి. పొట్టేల్ ఎందుకు కనిపించకుండా పోయింది. తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇక ఈ సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

