నందమూరి అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వీరసింహారెడ్డి (Veera Simha Reddy)థియేటర్లలోకి రానే వచ్చింది. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ టచ్ చేస్తూ సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా వీరసింహారెడ్డి మంచి టాక్ తెచ్చుకుంటోంది. స్టార్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటించాడు. హనీరోజ్, శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించారు.
బాలకృష్ణ వన్ మ్యాన్ షోలా వీరసింహారెడ్డి స్క్రీనింగ్ అవుతోందని క్రిటిక్స్ టాక్. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యుయల్ రోల్లో నటించాడు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. వరలక్ష్మి శరత్‌కుమార్, పీ రవిశంకర్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. చంద్రికా రవి స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.
వీరసింహారెడ్డి మేకింగ్ స్టిల్స్..
Making Stills from #VeeraSimhaReddy with the GOD OF MASSES 🔥
Here are the #FramesOfVeeraSimhaReddy 💥
Mass Jaathara in Theatres from JAN 12 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/blb7QgpBYc
— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
వీరసింహారెడ్డి టీజర్..
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..