Pooja Hegde: ప్రేరణకు బర్త్ డే విషెస్.. ఏంజెల్లా కనిపిస్తున్న పూజా హెగ్డే

నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాలు ముద్దు గుమ్మ పూజా హెగ్డే . వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాలో గోపికమ్మగా అలరించిన పూజా.. అల వైకుంఠపురములో చిత్రంలో బుట్ట బొమ్మగా అందరి మనసులు దోచుకుంది. ఇక త్వరలో ప్రేరణగా పలకరించనుంది. ఈ రోజు పూజా హెగ్డే బర్త్ డే కావడంతో ఆమెకు సంబంధించిన పోస్టర్ని రాధే శ్యామ్ చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఏంజెల్లా కనిపిస్తుంది పూజా.మరో వైపు పూజా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి కూడా పోస్టర్ విడుదల చేశారు. ఇది కూడా ఆకట్టుకునేలా ఉంది.
ఈ రోజు పూజా హెగ్డే 31వ వసంతంలోకి అడుగుపెట్టగా, ఆమెకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులు అయితే హ్యాపీ బర్త్ డే పూజా అనే హ్యాష్ ట్యాగ్‌ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లి దండ్రులది కర్ణాటకలోని మంగళూరు అయినా.. వీళ్లు సెటిల్ అయింది మాత్రం ముంబైలో. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా రానున్న రోజులలోమహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించేందుకు సిద్ధంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

