Shootings | రామోజీ ఫిలిం సిటీని మించిన లోకేషన్.. ఆ గ్రామంలో ఏకంగా 5వేల పాటల షూటింగ్
Shootings | మేకర్స్ తెరపై కొన్ని సన్నివేశాలని చాలా అందంగా చూపించేందుకు సినిమా రిలీజ్‌కి ముందే పలు ప్రాంతాలని సెర్చ్ చేస్తారు. తమ కథకి తగ్గట్టు ఏ లోకేషన్లో ఫలానా సన్నివేశాన్ని తీయాలి, ఏ లొకేషన్లో డ్యూయట్స్ తీయాలి, ఏ లొకేషన్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాలి వంటి వాటిలో ఓ అంచనాకి వస్తారు.
Shootings | మేకర్స్ తెరపై కొన్ని సన్నివేశాలని చాలా అందంగా చూపించేందుకు సినిమా రిలీజ్‌కి ముందే పలు ప్రాంతాలని సెర్చ్ చేస్తారు. తమ కథకి తగ్గట్టు ఏ లోకేషన్లో ఫలానా సన్నివేశాన్ని తీయాలి, ఏ లొకేషన్లో డ్యూయట్స్ తీయాలి, ఏ లొకేషన్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాలి వంటి వాటిలో ఓ అంచనాకి వస్తారు. అయితే సినిమా షూటింగ్ అంటే దాదాపు మనందరికి గుర్తొచ్చే ప్రాంతాలు ఎక్కువగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. అక్కడి స్టూడియోలు వాటి చుట్టు పక్కన ప్రాంతాలలో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్‌లో అంటే ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీలోనే మూవీ షూటింగ్స్ జరుగుతుంటాయి.
అయితే ఒక ఊరు రామోజీ ఫిల్మ్ సిటీనే మించిపోయింది. వందల, వేల షూటింగ్స్ జరిగిన ఆ గ్రామం చాలా మందిని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఊరు తమిళనాడులో ఉంది. ఎంతో మంది మేకర్స్‌కి ఆ ఊరు ఫేవరేట్ షూటింగ్ స్పాట్. మరి ఆ ఊరేంటనే కదా మీ డౌట్ పొల్లాచ్చి. అక్కడ దాదాపు 1500కు పైగా సినిమాల షూటింగ్స్ జరిగాయి. 5000 కు పైగా పాటల షూటింగ్స్ కూడా ఆ గ్రామంలో జరిగాయి. ఎంతో అందంగా ఉండే పొల్లాచ్చి సినిమా వాళ్లనే కాకుండా పర్యాటకులని సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పొల్లాచ్చిలో చిత్రీకరించిన సినిమాల విషయానికి వస్తే ఇక్కడ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ పొల్లాచ్చిలో జరిగాయి. భారతదేశంలో పొల్లాచ్చి కొబ్బరికి రాజధాని. ఇక్కడ పండే కొబ్బరి బొండాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందమైన ప్రాంతాలు, సుందరంగా కనిపించే తోటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే తమిళనాడులోని పొల్లాచ్చి సినిమా వారికి ఫేవరెట్ షూటింగ్ స్పాట్‌గా నిలిచింది. మీరు తమిళనాడు వెళ్లినప్పుడు ఒక్కసారి పొల్లాచ్చి వెళ్లి చూడండి, అక్కడి నుండి తిరిగి రావాలని ఎవరికి అనిపించదు. అంత అందంగా ఉంటుంది ఆ ప్రాంతం. దర్శకుడు శంకర్ కూడా చాలా సినిమాల షూటింగ్ లో పొల్చాచ్చిలో జరిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

