Sarkaru Vaari Paata | ‘సర్కారువారి పాట’ పెన్నీ వీడియో సాంగ్ రిలీజ్!
Penny Video Song | సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. సరిలేరు తర్వాత దాదాపు రెండున్నరేళ్ళకు అభిమానులను ఈ చిత్రంతో పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే ‘మేజర్’, ‘విక్రమ్’ లేటెస్ట్గా ‘అంటే సుందరానికీ’ సినిమాలు విడుదలవడంతో ‘సర్కారు వారి పాట’ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. దాదాపు అన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని తొలిగించారు. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ‘పెన్నీ’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
థమన్ స్వర పరిచిన ఈ పాట ట్యూన్ కొత్తగా.. లిరిక్స్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ పాటలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో హ్యండ్సమ్గా కనిపించాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను నకాష్ అజీజ్ ఆలపించాడు. ఇటీవలే విడుదలైన మురారి వా వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

