Peddi | యూఎస్ బాక్సాఫీస్‌లో ‘పెద్ది’ ప్రభంజనం.. రిలీజ్‌కు ముందే 1 మిలియన్ డాలర్ల మైలురాయి!
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ముందే రికార్డుల వేట ప్రారంభించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ముందే రికార్డుల వేట ప్రారంభించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓవర్సీస్ మార్కెట్లో, ముఖ్యంగా అమెరికాలో ‘పెద్ది’ సెన్సేషనల్ ప్రీ-సేల్స్ నమోదు చేస్తోంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా యూఎస్ ప్రీమియర్ బుకింగ్స్ ద్వారా విడుదలకు ముందే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా RRR తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో అమెరికాలో ఈ స్థాయి ప్రీ-సేల్స్ సాధించిన సినిమాగా ‘పెద్ది’ నిలవడం విశేషం.
ఇప్పటికే అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలకు టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల సినీ అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. విడుదలకు ఇంకా కొంత సమయం ఉండగానే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి రిలీజ్ డే కలెక్షన్లపైనే ఉంది. సినిమా విడుదల నాటికి 2 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ‘పెద్ది’లో రామ్ చరణ్ పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించనుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో భావోద్వేగాలు, యాక్షన్, క్రీడా అంశాలు ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకున్నాయి.
ఈ చిత్రంలో ప్రముఖ నటులు జగపతి బాబు, బోమన్ ఇరానీ, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ మార్కెట్లో టికెట్ బుకింగ్స్‌కు భారీ స్పందన లభిస్తుండటంతో, రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే చిత్రంగా ‘పెద్ది’ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగా అభిమానుల దృష్టంతా జూన్ 4 బాక్సాఫీస్ ఫలితాలపైనే ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

