‘ఓజీ’లో పవన్ పాట
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ పాటలు పాడటం కొత్తేమీ కాదు. తమ్ముడు, ఖుషి, జాని, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో ఆయన తన గాన కౌశలంతో అభిమానుల్లో జోష్‌ను నింపారు.
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ పాటలు పాడటం కొత్తేమీ కాదు. తమ్ముడు, ఖుషి, జాని, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో ఆయన తన గాన కౌశలంతో అభిమానుల్లో జోష్‌ను నింపారు. తాజా చిత్రం ‘ఓజీ’ కోసం పవన్‌కల్యాణ్ మరోమారు గొంతు సవరించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో కథానుగుణంగా పవన్‌కల్యాణ్‌తో ఓ పాట పాడించే అవకాశం ఉందని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు.
దీంతో మరోమారు పవన్‌కల్యాణ్ గళం నుంచి మాంచి హుషారైన పాట వినొచ్చని అభిమానులు సంబరపడిపోతున్నారు. ‘ఓజీ’ చిత్రాన్ని జపాన్-ముంబయి నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ అంచనాలను పెంచింది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్‌దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

