Vedalam Movie | ఏడేళ్ల కిందటే వేదాళం రీమేక్ పట్టాలెక్కింది..!
Vedalam Movie Telugu Remake | అవును మీరు చూస్తున్నది నిజమే. ఏడేళ్ల కిందటే వేదాళం తెలుగు రీమేక్ పట్టాలెక్కింది. కానీ అనుకోని కారణాల వల్ల పట్టాలుతప్పేసింది. నిన్న విడుదలైన భోళాకు ఏ రేంజ్లో టాక్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Vedalam Movie Telugu Remake | అవును మీరు చూస్తున్నది నిజమే. ఏడేళ్ల కిందటే వేదాళం తెలుగు రీమేక్ పట్టాలెక్కింది. కానీ అనుకోని కారణాల వల్ల పట్టాలుతప్పేసింది. నిన్న విడుదలైన భోళాకు ఏ రేంజ్లో టాక్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూ ఇవ్వలేరు. అభిమానులు సైతం మెహర్ రమేష్‌పై కోపంతో ఊగిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఏడేళ్ల కిందటే పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. కాకపోతే ఈ సినిమాను ముందుగా రీమేక్ చేయాలనుకుంది పవన్ కళ్యాణ్.
వేదాళం సినిమా 2015లో విడుదలై సూపర్ డూపర్ హిట్టయింది. అజిత్ నటనకు తమిళ తంబీలు వెర్రెత్తిపోయారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అయితే ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో కొన్ని నెలల తర్వాత తెలుగులో ఆవేశం పేరుతో డబ్ చేసి రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక అనిరుధ్ స్వరపరిచిన అలుమా డోలుమా తెలుగు వెర్షన్ పాటను కూడా ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేశారు. కానీ అనూహ్యంగా తర్వాత డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌ను ఆపేశారు. ఆపై కొన్నేళ్లకు పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. తమిళ దర్శకుడు నీసన్ డైరెక్షన్లో ఎ.ఎం.రత్నం రీమేక్ సినిమాను మొదలుపెట్టాడు.
హైదరాబాద్‌లో ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సెల్ అయింది. కారణాలేంటో తెలియదు కానీ.. అన్ని ఒకే అయిపోయి రేపో మాపో షూటింగ్ మొదలు పెట్టబోతుందనగా సినిమా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లీకైంది. మళ్లీ కొన్ని రోజులకే తెలుగు వెర్షన్ ఆన్లైన్లో కనిపంచలేదు. ఇక ఆ తర్వాత వేదాళం రీమేక్ గురించి ఎన్నో ఊహాగానాలు నడిచాయి. ఇక చివరికి మెహర్ రమేష్ రెండేళ్లు స్క్రిప్ట్‌పై కూర్చొని చిరుతో ఒప్పించాడు.
దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన ఫుల్ నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. మెహర్ ఇంకా రెండు దశాద్దాల కిందటే ఆగిపోయాడని.. సినిమాలకు రిటైర్మెంట్ తీసుకుంటే బాగుండేదని ఎన్నో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇక తొలిరోజు ఈసినిమా దాదాపు పాతిక కోట్ల రేంజ్లో గ్రాస్‌ను కొల్లగొట్టింది. అంటే దాదాపు బడ్జెట్లో 10శాతం కలెక్షన్లు మాత్రమే సాధించింది. దీనికి తోడు గురువారం రిలీజైన జైలర్ పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. మరి ఫైనల్ రన్లో ఈ సినిమా బయ్యర్లను సేఫ్ స్టేజీపై నిలబెడుతుందో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

