Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Pawan Kalyan | మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలైంది. మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ నవంబర్ 5న కాబోయే భార్య కిరణ్మయితో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Pawan Kalyan | మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలైంది. మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ నవంబర్ 5న కాబోయే భార్య కిరణ్మయితో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక విషయం మాత్రం పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం.సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఒకే వేదికపై మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సాయి దుర్గా తేజ్, కిరణ్మయి జంటకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఈ వేడుకకు సాయి దుర్గా తేజ్‌కు ఎంతో ఇష్టమైన మామయ్య పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం మాత్రం అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది. మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పవన్‌ను సాయి తేజ్ ఎంతో ఆప్యాయంగా మామయ్య అని పిలుస్తుంటారు. పవన్ కళ్యాణ్‌కు సాయి తేజ్ కూడా ఎప్పుడూ అండగా నిలుస్తూ తన అభిమానాన్ని చాటుకుంటారు.
ఇలాంటి ప్రత్యేకమైన కుటుంబ వేడుకలో వీరిద్దరూ కలిసి కనిపిస్తారని అభిమానులు ఆశించారు. ముఖ్యంగా నిశ్చితార్థ వేడుకలో పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ కలిసి దిగిన ఫొటోల కోసం ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ పవన్ ఈ వేడుకకు హాజరు కాకపోవడంతో కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన రాకపోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా అనే విషయంపై స్పష్టత లేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, పాలనా వ్యవహారాలతో ఆయన నిత్యం బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి హాజరు కాలేకపోయి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. సాయి దుర్గా తేజ్, కిరణ్మయి వివాహం డిసెంబర్ 10న జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకలోనైనా పవన్ కళ్యాణ్ పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

