Patas Praveen | టెలివిజన్ రంగంలో ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను అలరించిన ప్రవీణ్ జీవితంలో మరో కీలక దశలోకి అడుగుపెట్టాడు. జబర్దస్త్, పటాస్ వంటి పాపులర్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కమెడియన్, తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నటి, డ్యాన్సర్ కడెం వంశితతో ప్రవీణ్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు.ఇద్దరి నిశ్చితార్థం వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సింపుల్‌గా జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ జంట, తమ క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ప్రవీణ్ తన కెరీర్‌ను చిన్న చిన్న స్టేజ్ షోలతో ప్రారంభించి, తర్వాత జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. తన టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక పటాస్ షోలో కూడా తన హాస్యంతో మంచి గుర్తింపు పొందాడు. ఇక వంశిత కూడా నటి, డ్యాన్సర్‌గా టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ కొంతకాలంగా కొనసాగుతూ ఉండగా, ఇప్పుడు అది వివాహ బంధంగా మారబోతోంది.
ప్రవీణ్ – వంశిత నిశ్చితార్థం వార్త తెలిసిన వెంటనే టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం.అయితే ఫైమా బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందు వరకు ప్రవీణ్‌తో మంచి అనుబంధం మెయింటైన్ చేసింది. అయితే బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాత్రం ఇద్దరూ కలిసి కనిపించకపోవడంతో, వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి.ఈ విషయంపై తర్వాత ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ఫైమా, చిన్న చిన్న అపార్థాల వల్ల తాత్కాలికంగా దూరమయ్యామని వెల్లడించింది. “ఇప్పుడు మేము బాగానే మాట్లాడుకుంటున్నాం. మా రిలేషన్ గురించి మాకు క్లారిటీ ఉంది” అంటూ ఆమె స్పష్టం చేసింది.