Paruchuri | ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ.. టైటిల్ నుంచి స్క్రీన్‌ప్లే వరకు కీలక సూచనలు
Paruchuri | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లలో మోస్తరు ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, సాధారణ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Paruchuri | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లలో మోస్తరు ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, సాధారణ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.తన ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ సినిమాను విశ్లేషిస్తూ, ముఖ్యంగా స్క్రీన్‌ప్లేలో ఉన్న లోపాలను ప్రస్తావించారు. “పవన్ కల్యాణ్ అంటే నాకు ఎంతో అభిమానమని అందరికీ తెలుసు. ఈ సినిమాను థియేటర్లో చూడాలని అనుకున్నా, ఆరోగ్యం సహకరించలేదు. తర్వాత చూసినప్పుడు కథ, కథనం ప్రధాన అంశం నుంచి కొంత పక్కదారి పట్టినట్లు అనిపించింది” అని ఆయన అన్నారు.
సినిమాలో అనన్య పాత్ర మరణాన్ని ప్రస్తావిస్తూ, అది ఒక షాకింగ్ ఎలిమెంట్ అయినప్పటికీ, ప్రేక్షకులు పూర్తిగా కథలో లీనమయ్యేలోపే ఆ సన్నివేశం రావడం వల్ల ప్రభావం తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. అలాగే రెండు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లతో కథను నడిపిన తీరు కూడా కొంత గందరగోళాన్ని కలిగించిందన్నారు.పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించడం సహజమేనని పేర్కొన్న పరుచూరి, ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం విషయంలో మరింత జాగ్రత్త అవసరమని సూచించారు. అయితే ఇందులో విలన్లను సాధారణంగా కాకుండా ఉగ్రవాదులుగా చూపించడం ద్వారా ఆ అంశాన్ని సమర్థించే ప్రయత్నం చేశారని చెప్పారు.
ఇక సినిమా రెండో భాగంలో ప్రేమ కథను జోడించడం గురించి మాట్లాడుతూ, “ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్ ఎక్కువగా ఉండటంతో, సెకండాఫ్‌లో లవ్ ట్రాక్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కొంత ప్రేమ కథను ముందే చూపించి ఉంటే, భావోద్వేగం మరింత బలపడేదేమో” అని సూచించారు.అలాగే స్టార్ హీరో సినిమాల్లో హీరో ఎంట్రీ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. “పవన్ లాంటి స్టార్‌ను చూడటానికి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. కానీ ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల తర్వాతే ఆయన ఎంట్రీ ఇవ్వడం రిస్క్” అని వ్యాఖ్యానించారు.విలన్‌గా తమిళ నటుడు పార్తిబన్ ఎంపికను ప్రశంసించిన ఆయన, ఆ పాత్రను ముగించిన తీరు కూడా బాగుందని తెలిపారు. అయితే సినిమా టైటిల్ విషయానికి వస్తే, ‘భగత్ సింగ్’ అనే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి పేరు ఉపయోగించడం కంటే, కథకు సరిపోయే మరో పేరును ఎంచుకుని ఉంటే ప్రేక్షకుల అంచనాలు వేరేలా ఉండేవని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

