Partner Movie | అబ్బాయి అమ్మాయిలా మారితే.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఆది పినిశెట్టి పార్ట్నర్ ట్రైలర్
Partner Movie Trailer | పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగబ్బాయి కావడంతో ఆది పినిశెట్టికి ఇక్కడ కూడా కాస్త మంచి క్రేజే ఉంది. పైగా చిరు, వెంకీ, బాలయ్య, మోహన్ బాబులకు మరిచిపోలేని హిట్లిచ్చిన రవిరాజా పినిశెట్టి కొడుకు అవడంతో ఇక్కడి ప్రేక్షకులు ఆది సినిమాలను బాగానే ఆదరిస్తారు.
Partner Movie Trailer | పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగబ్బాయి కావడంతో ఆది పినిశెట్టికి ఇక్కడ కూడా కాస్త మంచి క్రేజే ఉంది. పైగా చిరు, వెంకీ, బాలయ్య, మోహన్ బాబులకు మరిచిపోలేని హిట్లిచ్చిన రవిరాజా పినిశెట్టి కొడుకు అవడంతో ఇక్కడి ప్రేక్షకులు ఆది సినిమాలను బాగానే ఆదరిస్తారు. దానికి తోడు నటనలో ఆయన ఎంత మేటో నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలం వంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. అంతేకాకుండా ఆది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే. ఇలా తెలుగు వాళ్లతో ఆదికి ఎనలేని అనుబంధం ఉంది. ఇక ఆది తన నటించిన ప్రతీ సినిమాను తెలుగులోనూ డబ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పార్ట్నర్ సినిమాను కూడా తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తుంది. డబ్బు చాలా అవసరమై దొంగతనాలు చేసే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండే ఆది, ఆయన ఫ్రెండ్ యోగిబాబుకు అనుకోకుండా ఓ అసైన్మెంట్ వస్తుంది. ఓ సైటింస్ట్ దగ్గర చిప్ దొంగతనం చేస్తే 20 లక్షలు ఇస్తామని చెప్పడంతో ఆది, యోగిబాబు దాని కోసం వెళ్తారు. అదే సమయంలో అనుకోకుండా ఓ మిషిన్‌లోంచి ఇంజక్షన్ వచ్చి యోగిబాబుకు గుచ్చుకుంటుంది. దాంతో అతను అమ్మాయి వేషంలో హన్సికలా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. తిరిగి యోగిబాబు తన ఒరిజినల్ బాడీలోకి వచ్చాడా లేదా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ఇదే కాన్సెప్ట్‌కు కావాల్సినంత హాస్యం జోడించినట్లు ట్రయిలర్ చూస్తే క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. థియేటర్‌కు వచ్చిన ఆడియెన్స్‌ను బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేస్తే మాత్రం సినిమా పాసవ్వడం ఖాయం. పైగా ఆదికి తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ఇదే కరెక్ట్ బొమ్మ. మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదికి జోడీగా హన్సిక మోత్వానీ, పాలక్ లల్వానీ నటిస్తున్నారు. సై-ఫై కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

