Aalochana | పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం “ఆలోచన” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, పద్మశ్రీ మురళి మోహన్ గారు గ్రాండ్‌గా విడుదల చేశారు. స్నేహం నేపథ్యంలో ఒక మంచి కాన్సెప్ట్‌తో, అద్భుతమైన నటుల కాంబినేషన్లో ఈ సినిమాను సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ వైవిధ్యభరితంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలితతో పాటు ప్రముఖ సీనియర్ నటుడు సుధాకర్ గారి అబ్బాయి బెన్నీ సుధాకర్ నూతనంగా పరిచయమవుతూ ప్రధాన పాత్రల్లో నటించారు.
పోస్టర్ లాంచ్ సందర్భంగా మురళి మోహన్ గారు మాట్లాడుతూ.. నిర్మాతలు ఎంతో మంచి సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మించారని, మంచి కథాబలం ఉన్న “ఆలోచన” సినిమా ఖచ్చితంగా విజయం సాధించి చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. టి. సురేంద్ర రెడ్డి కెమెరామెన్‌గా, వియాన్ సంగీత దర్శకుడిగా, ప్రతాప్ రాజులపల్లి పాటల రచయితగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఆర్.ఎల్.వర్మ ఎడిటర్‌గా, గిరీష్ దేవాంగ్ ఆర్ట్ డైరెక్టర్‌గా మరియు సీ.హెచ్.విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సాంకేతిక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ అప్డేట్స్ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.