BRO | వేగంగా 100 సినిమాలు నిర్మించడమే మా లక్ష్యం : బ్రో మూవీ నిర్మాత
BRO | ఒక మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ ‘బ్రో’ మాతృకను తమిళంలో చూసి తెలుగులో చేస్తే బాగుంటుందని సూచించారు. మా సంస్థలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన చిత్రం ‘బ్రో” అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆయన నటించిన తాజా చిత్రం ‘బ్రో’.
BRO | ఒక మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ ‘బ్రో’ మాతృకను తమిళంలో చూసి తెలుగులో చేస్తే బాగుంటుందని సూచించారు. మా సంస్థలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన చిత్రం ‘బ్రో” అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆయన నటించిన తాజా చిత్రం ‘బ్రో’. పవన్‌కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం విలేకర్లతో ముచ్చటించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ సందర్భంగా ‘బ్రో’ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ ‘తమిళ చిత్రంతో పోలిస్తే ఈ చిత్రం భారీగా వుంటుంది. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. కథలోని ఆత్మ మిస్ అవ్వకుండా స్క్రీన్‌ప్లేలో కొన్ని మార్పులు చేశాం.మాతృక చూసిన వారికి కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. పవన్‌కల్యాణ్ సినిమా మొదలైన పది నిమిషాల తరువాత కనిపిస్తారు, అక్కడి నుంచి సినిమా చివరి వరకు వుంటారు. టిక్కెట్ ధరలు కూడా పెంచే ఆలోచన లేదు. వేగంగా వంద సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం. ప్రస్తుతం 15 నుంచి 20 సినిమాలు మా సంస్థలో నిర్మాణ దశలో వున్నాయి. ఓటీటీ సినిమాలతో పాటు బాలీవుడ్ కూడా సినిమాలు చేసే ఆలోచనలు వున్నాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

