OTT Movies | మే రెండో వారం కూడా ఎంటర్టైన్మెంట్ ప్రియులకు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతుండగా.. మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘వీరభద్రుడు’, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా చిత్రం ‘పతి పత్నీ ఔర్ వో దో’ వంటి సినిమాలు థియేటర్లలో ఆకట్టుకోనున్నాయి.
అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ వేదికల్లో కూడా పలు కొత్త కంటెంట్లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. హాలీవుడ్ యాక్షన్ నుంచి థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లు, సస్పెన్స్ డ్రామాల వరకు ఈ వారం ప్రేక్షకులకు విభిన్నమైన వినోదం అందుబాటులోకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన గణం ఉన్న వెబ్‌సిరీస్ ‘బెర్లిన్: అండ్ ది లేడీ విత్ యాన్ ఎర్మైన్’ మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సిరీస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.
మలయాళ చిత్రం ‘ఒరు దూరహ సాహచర్యతిల్’ మే 13 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. భావోద్వేగ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే యాక్షన్ ఫాంటసీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డెవిల్ మే క్రై: సీజన్ 2’ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ‘గుడ్ ఆమెన్స్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ మే 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫాంటసీ, కామెడీ మేళవింపుతో రూపొందిన ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే యూత్‌ఫుల్ డ్రామాగా రూపొందిన ‘ఆఫ్ క్యాంపస్: సీజన్ 1’ కూడా మే 13 నుంచే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
హాలీవుడ్ యాక్షన్ ప్రియుల కోసం ‘ద పనిషర్: వన్ లాస్ట్ కిల్’ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇవ్వనుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల అభిమానులు ఎదురుచూస్తున్న ‘కాళిదాస్ 2’ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొదటి భాగం మంచి విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై కూడా ఆసక్తి నెలకొంది.
మరాఠీ వెబ్‌సిరీస్ ‘తిఘీ’ మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా ప్రేక్షకులకు వినోదం కొరత ఉండదనే చెప్పాలి. యాక్షన్, థ్రిల్లర్, ఫాంటసీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల కంటెంట్లు అందుబాటులోకి రానుండటంతో మూవీ లవర్స్‌కు ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీక్‌గా మారనుంది.