Oscars | ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే ఆస్కార్ అవార్డుల వేడుకలకు సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కీలక ప్రకటన చేసింది. రాబోయే 99వ మరియు 100వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ తేదీలను అధికారికంగా ఖరారు చేస్తూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, 99వ ఆస్కార్ వేడుకను 2027 మార్చి 14న, అలాగే ప్రతిష్టాత్మకమైన 100వ ఆస్కార్ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరగనున్న ఈ రెండు వేడుకలు ఏబీసీ (ABC) నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
అయితే, 2029 నుంచి ఆస్కార్ చరిత్రలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న డాల్బీ థియేటర్ వేదికను వదిలి, 2029 నుంచి లాస్ ఏంజిల్స్‌లోని పీకాక్ థియేటర్లో ఈ వేడుకలను నిర్వహించాలని అకాడమీ నిర్ణయించింది. అంతేకాకుండా దశాబ్దాల పాటు కొనసాగిన టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌కు స్వస్తి పలుకుతూ, 2029 నుండి ఆస్కార్ వేడుకలను నేరుగా యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబోతున్నారు. 2026-2027 అవార్డుల సీజన్‌కు సంబంధించి, 2026 ఏడాది పొడవునా విడుదలయ్యే సినిమాలు అవార్డులకు అర్హత పొందుతాయని, 2027 జనవరి 21న నామినేషన్లను ప్రకటిస్తామని అకాడమీ స్పష్టం చేసింది. గత ఏడాది ప్రేక్షకుల నుంచి వ్యూస్ తగ్గిన నేపథ్యంలో గ్లోబల్ రీచ్ పెంచుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వైపు అడుగులు వేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Mark your calendars! The 99th Oscars will take place on Sunday, March 14, 2027.
Nominations will be announced on Thursday, January 21, 2027.
Find more key dates for the 2026 awards season here: https://t.co/KSSJZCRfZI pic.twitter.com/6LUxXM0dS3
— The Academy (@TheAcademy) April 7, 2026