Oscar Challagariga | చంద్రబోస్‌పై డాక్యుమెంటరీ.. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన ‘ఆస్కార్ చల్లగరిగ’.!
Oscar Challagariga | ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చిల్కూరి సుశీల్ రావు (Sushil Rao Chilkuri) స్వీయ దర్శకనిర్మాణంలో వచ్చిన డాక్యూమెంటరీ చిత్రం ‘ఆస్కార్ చల్లగరిగ’(Oscar Challagariga). ఈ డాక్యూమెంటరీ తాజాగా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes World Fim Festival) అలాగే ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Mumabi Short International Film Festival) కు ఎంపికైంది.
Oscar Challagariga | ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చిల్కూరి సుశీల్ రావు (Sushil Rao Chilkuri) స్వీయ దర్శకనిర్మాణంలో వచ్చిన డాక్యూమెంటరీ చిత్రం ‘ఆస్కార్ చల్లగరిగ’(Oscar Challagariga). ఈ డాక్యూమెంటరీ తాజాగా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes World Fim Festival) అలాగే ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Mumabi Short International Film Festival)కు ఎంపికైంది. 2023 ఆస్కార్ వేడుకలలో ‘ఆర్ఆర్ఆర్'(RRR) మూవీలోని నాటు నాటు పాటకు గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆస్కార్ అందుకొని తిరిగి వచ్చిన చంద్రబోస్ కి తెలుగు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు.
అయితే చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న అనంతరం తొలిసారిగా తన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగకు వచ్చినప్పుడు వందలాది గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా చంద్రబోస్‌ను తీసుకెళుతూ.. గ్రామస్తులు ఆయనపై పూల వర్షం కురిపించారు. అయితే ఈ చిన్న చిన్న సంఘటనలనే చిల్కూరి సుశీల్‌రావు ఒక డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించాడు. దీంతో ఈ డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లో నిర్వహించే ప్రఖ్యాత కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. దీనితో పాటు 2023న ముంబైలో జరగనున్న 12వ ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సైతం ఈ డాక్యుమెంటరీ ఎంపిక అయ్యింది. దీంతో రెండు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లకు ఈ డాక్యుమెంటరీ ఎంపికవడం పట్ల సుశీల్ రావుకు తెలుగు ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే విషయంపై సంతోషం వ్యక్తం చేసిన సుశీల్ రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ డాక్యుమెంటరీ కేవలం చంద్రబోస్దే కాదు.. చంద్రబోస్‌పై ప్రేమను కురిపించిన గ్రామస్తులది కూడా అని సుశీల్‌రావు పేర్కొన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

