The Acedamy | ఏఐ మూవీలకు ఆస్కార్ అవార్డులు.. 2026 నుంచి కొత్త నిబంధనలు
The Acedamy | చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక వివరాలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించింది.
The Acedamy | చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక వివరాలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో జరగనుండగా… ఈసారి అకాడమీ కొన్ని నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది.
2026 జనవరి 22న ఆస్కార్ నామినేషన్ జాబితాను వెల్లడించనున్నట్లు ప్రకటించిన అకాడమీ.. ఓటింగ్ విధానంలో పలు కేటగిరీలలో మార్పులు చేసినట్లు ప్రకటించింది. నామినేట్ అయిన ప్రతి చిత్రాన్ని అకాడమీ సభ్యులు తప్పనిసరిగా చూడాలని నిర్ణయించింది.
కొత్తగా ‘అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు అకాడమీ వెల్లడించింది. ఈ విభాగంలో రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని, తుది ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లకు పలు రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని తెలిపింది. ఈసారి కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో నిర్మించిన చిత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు అకాడమీ పేర్కొంది. అయితే, ఏఐ చిత్రాలు ఇతర చిత్రాలపై ప్రభావం చూపవని, సాధారణ చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు ఆస్కార్ అవార్డులకు పోటీపడనున్నాయి. అయితే, మ్యూజిక్ విభాగంలో నామినేషన్ గడువును 2025 అక్టోబర్ 15గా నిర్ణయించినట్లు అకాడమీ తెలిపింది. ఈ కొత్త నిబంధనలతో 98వ ఆస్కార్ వేడుక చలన చిత్ర ప్రియులకు మరింత ఆసక్తికరంగా ఉండనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

