Mithila Palkar | నా జీవితంలో దానికి ప్రత్యేక స్థానముంది.. ఓరి దేవుడా హీరోయిన్ మిథిలా పాల్కర్ మనోగతం
Mithila Palkar | ‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ముంబై భామ.. మిథిలా పాల్కర్. తొలి సినిమాతోనే అభినయంలో మంచి మార్కులు కొట్టేసిందీ ‘పొట్టి నూడుల్స్'.
Mithila Palkar | ‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ముంబై భామ.. మిథిలా పాల్కర్. తొలి సినిమాతోనే అభినయంలో మంచి మార్కులు కొట్టేసిందీ ‘పొట్టి నూడుల్స్’. నటిగానే కాకుండా వ్యాఖ్యాతగా, సోషల్ మీడియా స్టార్గా, గాయనిగా, రచయిత్రిగా అభిమానులను అలరిస్తున్న ఈ ఉంగరాల జుట్టు చిన్నది చాలా కబుర్లు చెబుతున్నది.
చిన్నప్పటినుంచీ నాకు ధైర్యం ఎక్కువ. దానికి కారణం కచ్చితంగా మా నానమ్మ-తాతయ్యలే. కారణం ఏదైనాసరే, ఏడవకుండా సమస్య ఏమిటన్నది నిర్భయంగా చెప్పడం నేర్పించారు. అందుకే ఏదైనా నాకు తప్పనిపిస్తే, నిర్భయంగా చెప్పడానికి వెనకాడను.
ఈరోజుల్లో ఇంట్లో నానమ్మ-తాతయ్య లాంటి బంధాలు, బంధుత్వాల మధ్య పెరిగే పిల్లలు చాలా తక్కువ. అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీసే. మిగిలినవారికి, గ్రాండ్ పేరెంట్స్ మధ్య
పెరిగిన పిల్లలకూ చాలా తేడా ఉంటుంది. పెద్దల సమక్షంలో పెరిగిన పిల్లల ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి.
నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. గ్రాండ్ పేరెంట్స్తోపాటు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ మధ్య కూడా పెరిగాను. వాళ్లు చెప్పే కథలు, మంచిమాటలు చిన్నప్పటి నుంచే నా ఆలోచనా దృక్ఫథాన్ని నిర్ణయించాయి. ఆ నీతికథల ప్రభావంతోనే ‘లిటిల్ థింగ్స్’ కార్యక్రమంలో అలవోకగా పిల్లలకు కథలు చెప్పగలిగాను.
ఒకప్పటితో పోలిస్తే హీరోయిన్లకు ఇది కచ్చితంగా స్వర్ణయుగమే! ప్రేక్షకులు మహిళా ప్రధాన చిత్రాలను ఆదరిస్తున్నారు. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ డిమాండ్ చేయగలిగే స్థాయికి ఎదిగారు కథానాయికలు. కాకపోతే వైవిధ్యాన్ని, కొత్తదనాన్ని ప్రేమించగలగాలి.
సోషల్ మీడియాకు నా జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం అందించే కంటెంట్ను బట్టే అభిమానులు మనల్ని ఆదరిస్తారని నమ్ముతాను. తారతమ్యాలు లేకుండ అందరినీ ఒకే వేదికపై నిలిపే సోషల్ మీడియా ఈతరానికి బాగా దగ్గరైంది. ఒకరకంగా చెప్పాలంటే నా కెరీర్ మొదలైంది కూడా ఇక్కడే.
ఫలానా సినిమాలే చేయాలనే హద్దులు పెట్టుకోలేదు. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ విభిన్న పాత్రల్లో నటిస్తూ.. నన్ను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. సినిమా, ఓటీటీ, టెలివిజన్.. ఇలా వేదిక ఏదైనా ప్రేక్షకులను అలరించడమే నా ప్రధాన లక్ష్యం.
హిందీతోపాటు తమిళ, తెలుగు భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ‘ఓరి దేవుడా’తో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం పొందడం చాలా సంతోషంగా ఉంది. విశ్వక్సేన్ ‘పొట్టి నూడుల్స్’ అని పిలిచిన ప్రతిసారీ తెగ నవ్వొచ్చేది. టాక్ షోలు, టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా కూడా నేను చాలామందిని పలకరిస్తాను.
Read More :
“Mithila Palkar | మిథిలా పాల్కర్ అందాలు అదరహో..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

