అలాంటి నటుడు ఆమిర్ ఒక్కరే
ఆమిర్‌ఖాన్ నటించిన కొత్త సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. తెలుగులో చిరంజీవి సమర్పణలో ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో కరీనా కపూర్ నాయికగా నటించగా..నాగ చైతన్య కీలక పాత్రను పోషించారు. తాజాగా ఈ చిత్ర ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ…‘మా సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆయన సహకారం ఎంతో అవసరం.
కొద్ది వారాల కిందట ఆయన్ను కలిసి సినిమా చూడాలని కోరాను. చిరంజీవి అంగీకరించి సినిమా చూశారు. ఆయన ప్రజెంటర్‌గా ఉంటానని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. ఇవాళ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు హిందీలో గొప్ప ఆదరణ పొందుతున్నాయి. అలాగే మేము తెలుగు ప్రేక్షకులకు చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాం’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ…‘ఆమిర్‌ఖాన్ ఫోన్ చేసి ‘లాల్ సింగ్ చడ్డా’ గురించి చెప్పినప్పుడు ఈ సినిమాను సమర్పించడం ఒక గౌరవంగా భావించాను.
ఒక సినిమా కోసం, పాత్ర కోసం ఆమిర్ పడే తపనకు నిదర్శనం ఈ సినిమా. 14 ఏళ్లు ఒక రీమేక్ కోసం వేచి చూడటం ఆయన వల్లే సాధ్యమైంది. ఇలాంటి నటుడు దేశంలో ఆమిర్‌ఖాన్ ఒక్కడేనని చెప్పగలను. మనమంతా గర్వపడే నటుడు ఆయన.
ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమాలో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ…‘ఆమిర్‌ఖాన్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇవాళ ఆయనతో కలిసి నటించడం ఎంతో గర్వంగా అనిపిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమిర్‌ఖాన్ నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. అవి జీవితాంతం నాకు గుర్తుంటాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

