OG 2 | ‘ఓజీ 2’పై థమన్ సాలిడ్ అప్డేట్.. సెప్టెంబర్‌లో పవన్ ఫ్యాన్స్‌కు భారీ సర్ప్రైజ్?
OG 2 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ 2' గురించి సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, థమన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.
OG 2 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ 2’ గురించి సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, థమన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ గత ఏడాది దసరా సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పవన్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విజయంతోనే చిత్ర బృందం ఓజీ 2 ను అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా ఓజీ యూనివర్స్ గురించి ఆసక్తికర ప్రకటన చేశారు. దర్శకుడు సుజీత్‌తో మరోసారి కలిసి పని చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తెలిపింది. దీంతో సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హృదయం మురళి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న సంగీత దర్శకుడు థమన్‌కు అభిమానులు “ఓజీ… ఓజీ…” అంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఆయన “సెప్టెంబర్‌లో కలుద్దాం” అంటూ ఒక్క మాటతో భారీ హింట్ ఇచ్చారు.
థమన్ వ్యాఖ్యలతో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ 2 కు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టైటిల్ టీజర్ లేదా మరో ప్రత్యేక అప్డేట్ విడుదలయ్యే అవకాశముందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు అందరి చూపు చిత్ర బృందంపైనే ఉంది. ఓజీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఓజీ2తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

