OG Glimpse | అదిరిపోయిన ఓజీ గ్లింప్స్.. పవన్ ఫ్యాన్స్ కు పండగే
OG Movie Teaser | రీసెంట్గా బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఆయన నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ (OG). రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ టీజర్ గురించి అభిమానులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. వారి ఉత్కంఠకు తెరదించుతూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓజీ టీజర్‌ను విడుదల చేశారు.
OG Movie Glimpse | రీసెంట్గా బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఆయన నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ (OG). రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ టీజర్ గురించి అభిమానులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. వారి ఉత్కంఠకు తెరదించుతూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓజీ టీజర్‌ను విడుదల చేశారు.
”పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగకలేకపోయింది. ఇట్ వాస్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే.. సాలా షైతాన్ అజాయేగా అంటూ” బ్యాక్ గ్రౌండ్లో చెబుతున్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ సాగింది. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా స్టయిలిష్ లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. ఓజీలో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారు. ఓజీలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

