Ntr- Trivikram | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ నుంచి బర్త్‌డే బ్లాస్ట్?.. గ్రాండ్ వీడియోకు రంగం సిద్ధం!
Ntr- Trivikram | టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌లలో ‘గాడ్ ఆఫ్ వార్’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ భారీ చిత్రం గురించి రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Ntr- Trivikram | టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్‌లలో ‘గాడ్ ఆఫ్ వార్’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ భారీ చిత్రం గురించి రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేవతల సేనాధిపతి కార్తికేయుడి నేపథ్యంతో ఈ సినిమా రూపొందనుందని ఇప్పటికే టాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు ఈసారి ప్రత్యేక ట్రీట్ ఇవ్వాలని మూవీ టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి గ్రాండ్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం టైటిల్ పోస్టర్ మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా ఒక పవర్ఫుల్ అనౌన్స్మెంట్ వీడియోను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వీడియో పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. కథలో దేవతల ప్రపంచం, యుద్ధాల నేపథ్యం ఉండటంతో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వీడియోలో ఎన్టీఆర్ పాత్రను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించేలా డిజైన్ చేస్తున్నారట. వీఎఫ్ఎక్స్ పనులు సమయానికి పూర్తి అయితే ఎన్టీఆర్ బర్త్‌డే రోజున అభిమానులకు భారీ విజువల్ ఫీస్ట్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తారక్ అభిమానులు ఇప్పటికే భారీ హంగామా మొదలుపెట్టారు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌కే పవర్ఫుల్ రెస్పాన్స్ వస్తుండటంతో అధికారిక ప్రకటనపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు. గతంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ అధికారిక వీడియో విడుదలై సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- fans
- god of war
- NTR
- pan india
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

