NTR Speech | శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.. దేవర సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఎమోషనల్
NTR Speech at Devara Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తాజాగా సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది.
NTR Speech at Devara Event | ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తాజాగా సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుకకు.. ముఖ్య అతిథులుగా.. ఎన్టీఆర్‌తో పాటు కొరటాల శివ, రాజమౌళి, అనిరుధ్ రవిచందర్, నందమూరి కళ్యాణ్ రామ్, దిల్ రాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ సక్సెస్ ఈవెంట్లో నటుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎంతో కోలాహలంగా, అట్టహాసంగా.. గ్రాండ్‌గా అభిమానులందరితో జరుపుకోవాలి ఈ సక్సెస్ ఈవెంట్‌ను కానీ.. కొన్ని అనివార్య కారణాల వలన.. దేవి నవరాత్రులు ఉండడం వలన సెక్యూరిటీ అనేది దృష్టిలో పెట్టుకుని అనుమతి రాలేదు. అందుకే ఇలా చిన్నగా ఈ వేడుకను దేవర టీంతో నిర్వహించాం. ముందుగా ఇంతటి భారీ సక్సెస్‌ను అందించినటువంటి ప్రేక్షక దేవుళ్లందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను.
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు దేవర. ఈ ఏడు చిత్రాల విజయం వెనక నా దర్శకులతో పాటు సంకేతిక నిపుణులతో పాటు నా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మా అభిమానులు. ఏ జన్మలో చేసుకున్న రుణమో.. ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయిన.. కలిసి రక్తాన్ని పంచుకోకపోయిన.. రక్త సంబంధం కంటే కూడా రుణపడిపోయో అనుభందం ఏర్పడింది మీ అందరితో. ఎప్పుడు నా వెన్నంటే ఉండి.. నాకోసం పోరాడుతూ.. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులను అందజేస్తున్నందుకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అంటూ తారక్ ఎమోషనల్ అయ్యాడు.
ఈ జన్మలో కాకపోయిన వచ్చే జన్మలో అయిన మీ రుణం తీర్చుకుంటాను. అప్పటివరకు వడ్డిని లెక్కవేస్తుంటాను. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిడానికి కారణం దేవర టీం. ఈ సినిమాకోసం కష్టపడ్డా ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

