NTR| యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా అందిపుచ్చుకున్నాడు. ఇటీవల దేవర అనే సినిమాతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్‌కి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. వార్ 2 మూవీ షూటింగ్ కోసమే రెగ్యులర్ గా హైదరాబాద్ టూ ముంబై జర్నీ చేస్తున్నాడు. వారంలో రెండు మూడు రోజులు ఎయిర్ పోర్టుల్లోనే కనిపిస్తున్నాడు జూనియర్. అయితే ఒక్కోసారి ఒక్కో లుక్‌లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఇటీవల ఎన్టీఆర్ ముంబై విమానాశ్రయంలో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో పాటు, ఆయన ధరించిన వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు 7.47 కోట్ల రూపాయలు ఉంటుందట. ఎన్టీఆర్ రోల్స్ రాయిస్ కారు కంటే ఖరీదైన వాచ్ ధరించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ రేర్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.తారక్ చిన్ననాటి వీడియోని ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా,ఇది అభిమానులని ఆకట్టుకుంటుంది.
ఇది ఒక పబ్లిక్ ఈవెంట్ కాగా, ఇందులో నందమూరి వారసుడు నిక్కర్ వేసుకొని ఉన్నాడు. పక్కనే అలనాటి నటి ఊర్వశి కూడా మనకు కనిపిస్తుంది. ఇద్దరూ దేని గురించో మాట్లాడుకుంటూ కనిపించారు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ చప్పట్లు కొడుతూ నవ్వుతూ వీడియోలో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది. ఇది గతంలోనూ ఓసారి సోషల్ మీడియాలో వైరల్ కాగా, మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ గ్రూప్స్‌లో షేర్ చేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్‌తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ క్రేజ్‌ని మరింత పెంచనుంది.
#Rarevideo 🚨 Young #JrNTR footage ❤️#NTRNeel | #War2
Credits : Gajuwaka NTR fans pic.twitter.com/lvjLw1LUom
— TollywoodRulz (@TollywoodRulz) March 17, 2025