NTR | రేపు ఎన్టీఆర్ సతీమణి బర్త్ డే.. జూనియర్ అలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారా..!
NTR | టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో రేపు పండుగ వాతావరణం నెలకొనబోతోంది. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ జంట బర్త్‌డే వేడుకలను సింపుల్‌గా జరుపుకుంటూ ఉంటారు.
NTR | టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో రేపు పండుగ వాతావరణం నెలకొనబోతోంది. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ జంట బర్త్‌డే వేడుకలను సింపుల్‌గా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ వేదికలో భారీ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. తన భార్యకు సర్ప్రైజ్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే తారక్, ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
ఈ లావిష్ పార్టీకి హాజరయ్యే అతిథుల జాబితా కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా టీమ్ మొత్తం ఈ వేడుకలో పాల్గొనే అవకాశముంది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, అలాగే ఇండస్ట్రీలో తారక్‌కు అత్యంత సన్నిహితులైన కొందరు ప్రముఖులు, మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ పార్టీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ బిజీ సమయంలో జరుగుతున్న ఈ సెలబ్రేషన్ యూనిట్‌కు కూడా మంచి రిలీఫ్‌గా మారనుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఒకవైపు ఈ వేడుకలు జరుగుతుండగా, మరోవైపు డ్రాగన్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. KGF, సలార్ వంటి భారీ హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 2026 జూన్ 25న విడుదల లక్ష్యంగా పనులు జరుగుతుండగా, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా తేదీలో మార్పులు వచ్చే అవకాశమూ ఉందని టాక్. అయితే రేపు జరగబోయే ప్రణతి బర్త్‌డే వేడుకలో ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

