NTR Neel | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే!
NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది.
NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ (PrashanthNeel)తో తారక్ సినిమా చేయబోతున్నాడు. #NTRNeel గా రానున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా ఎప్పుడు అప్డేట్లు వస్తాయా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే మూవీ షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ షూటింగ్‌ను సంక్రాంతి అనంతరం జనవరి 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని మంగళూరులో ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ స్టార్ట్ అవ్వనున్నట్లు ఇందులోనే ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు 7 నెలలలో ఈ సినిమా షూటింగ్‌ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి లోపు సినిమాను తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

