NTR | ప్రశాంత్ నీల్ కోసం నాటు కోడి పులుసు పంపించిన తారక్.. ఫోటో వైరల్
PrashanthNeel | 'కేజీఎఫ్' సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వంద కోట్ల బొమ్మ కూడా లేని కన్నడ పరిశ్రమకు వెయ్యి కోట్ల సినిమాను పరిచయం చేశాడు. ఇక ఆదివారం ప్రశాంత్ నీల్ తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి.
PrashanthNeel | ‘కేజీఎఫ్’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వంద కోట్ల బొమ్మ కూడా లేని కన్నడ పరిశ్రమకు వెయ్యి కోట్ల సినిమాను పరిచయం చేశాడు. ఇక ఆదివారం ప్రశాంత్ నీల్ తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఇక ప్రభాస్ సలార్ సెట్లో శనివారం అర్థ రాత్రి ప్రశాంత్ పుట్టన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్, తారక్ లు కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ ను తెలియజేశారు.
ఇక తారక్ ఏకంగా నాటు కోడి పులుసు పంపించి బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దేవర తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. రగ్గుడ్ లుక్ లో ఎన్టీఆర్ ని చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే తారక్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- NTR31
- Prashanth neel
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

