NTR | యష్‌రాజ్ ఫిలింస్ బ్లాక్బాస్టర్ ‘వార్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వార్- 2’. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తారని తొలుత వార్తలు వినిపించాయి. అయితే అవేమీ నిజం కావని, యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వచ్చిన ఏజెంట్స్ తరహాలోనే ఎన్టీఆర్ సైతం పవర్ఫుల్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది.
హృతిక్‌తో కలిసి విలన్ గ్యాంగ్‌ని ఎదుర్కొనే ఏజెంట్‌గా ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ పాత్ర డిజైన్ విషయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, బాలీవుడ్ ఎంట్రీ చిత్రం కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయలా ఆయన క్యారెక్టర్‌ను తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం ఆయన ‘వార్-2’ సెట్లో జాయిన్ అవుతారని, బహుశా మే నెలలో ఆయన ఎంట్రీ ఉండొచ్చని సమాచారం.