Tollywood | ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమా అంటే కనీసం ఏడాది సమయం పట్టేది. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు తగిలితే అవి రెండు మూడేళ్లు అవుతుంది. ఒక్కో సినిమా కోసం మూడు నాలుగు సంవత్సరాలు తీసుకున్న దర్శకులు కూడా మన దగ్గర ఉన్నారు. అయితే ఇప్పుడు పద్ధతులు మారుతున్నాయి.. పరిస్థితులు మారుతున్నాయి.. మరీ ముఖ్యంగా మన స్టార్ హీరోల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఒక్క సినిమా కోసం ఏడాది సమయం ఇవ్వడం కంటే.. మూడు నెలల్లో సినిమా పూర్తి అయిపోవాలి అని కొత్త కండీషన్స్ పెడుతున్నారు. పూర్తిగా హాలీవుడ్ ఫార్మట్ ఇక్కడ అప్లై చేస్తున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు.
2-3 సంవత్సరాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్న తర్వాత.. ఎంత పెద్ద సినిమా అయినా ఒకసారి సెట్స్ పైకి వస్తే నాలుగైదు నెలల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఇదే సూత్రం అప్లై చేయాలని మన హీరోలు భావిస్తున్నారు. అందుకే ఒక్కొక్కరూ నాలుగైదు సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నారు. దాని వెనుక ఉన్న నమ్మకం కూడా ఇదే. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా ఉంటే సినిమాలు మూడు నెలల్లో పూర్తి చేయాలని వాళ్లు భావిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాల షూటింగ్ కేవలం 50 రోజుల లోపు పూర్తయిపోయాయి.
నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న బంగార్రాజు సినిమా కూడా కేవలం 50 రోజుల వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. చిరంజీవి తన గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమాల కోసం గరిష్టంగా 60 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడు. వీళ్లు మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇప్పుడు ఒక సినిమా కోసం 3 నెలలు మాత్రమే డేట్స్ ఇస్తున్నారు. అందులోనే సినిమా పూర్తి చేయాలని దర్శకులకు కండీషన్స్ పెడుతున్నారు. హీరోలు అప్లై చేస్తున్న ఈ ఫార్ములా నిర్మాతలకు లాభాలు చేకూరుస్తుంది. పని దినాలు తక్కువైతే ఆటోమేటిక్ గా బడ్జెట్ కూడా కంట్రోల్ అవుతుంది. సీనియర్ హీరోలు చాలామంది ఇదే దారిలో వెళ్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ లాంటి పెద్ద సినిమాలు కేవలం 103 రోజుల్లో పూర్తి చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chiranjeevi: చిరంజీవి చెల్లెలుగా సీనియర్ హీరోయిన్.. ట్విస్ట్ బాగుంది..!
చిరంజీవి-సల్మాన్‌ఖాన్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందా..?
తమన్నా ప్లాన్స్ అన్నీ నాశనమయ్యాయట..!
దృశ్యం 2 థియేటర్ సినిమా కాదని వెంకటేశ్ ముందే ఫిక్సయ్యాడా..?
Faria Abdullah | నాగార్జునతో ‘జాతిరత్నాలు’ హీరోయిన్ డ్యాన్స్
బాబాయితో థియేటర్లలో నందమూరి హీరో సందడి