ఫస్ట్ ఛాయిస్ ఐశ్వర్యరాయ్ కాదు!
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’ ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. చోళ రాజుల్లో ప్రసిద్ధుడైన పదో శతా బ్దం నాటి రాజరాజ చోళ -1 ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’ ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. చోళ రాజుల్లో ప్రసిద్ధుడైన పదో శతా బ్దం నాటి రాజరాజ చోళ -1 ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో అగ్ర తార ఐశ్వర్యరాయ్ తల్లీకూతుళ్లుగా ద్విపాత్రాభినయంలో కనిపించనుంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాల సందర్భం గా పాత్రికేయులతో ముచ్చటించిన దర్శకుడు మణిరత్నం..ఐశ్వర్యరాయ్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 1994లో ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చిందని, ఐశ్వర్యరాయ్ పాత్ర కో సం అప్పట్లో రేఖను ఎంపిక చేయాలనుకున్నానని చెప్పారు. తొలుత కమల్‌హాసన్‌తో ఈ సినిమా ప్లాన్ చేశానని, అనివార్య కారణాల వల్ల ఆ ప్రయ త్నం ఫలించలేదన్నారు. ఇరవై ఏళ్లుగా ఈ కథతో తాను ప్ర యాణం సాగించానని మణిరత్నం తెలిపారు. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్న డ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

