Telugu Movies | పండగ సీజన్‌ను మిస్ చేసుకుంటున్న టాలీవుడ్ సినిమాలు.. ఈ సారి వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా రావడం లేదు..!
Telugu Movies | మాములుగా సినిమా రిలీజ్లు పండగ టైమ్‌ను లాక్ చేసుకుంటుంటాయి. ఎందుకంటే సినిమా యావరేజ్‌గా ఉన్నా సరే.. పండగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. దాంతో కంటెంట్ పెద్దగా లేకపోయినా.. ఈజీగా బ్రేక్ ఈవెన్లు అవుతుంటాయి.
Telugu Movies | మాములుగా సినిమా రిలీజ్లు పండగ టైమ్‌ను లాక్ చేసుకుంటుంటాయి. ఎందుకంటే సినిమా యావరేజ్‌గా ఉన్నా సరే.. పండగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. దాంతో కంటెంట్ పెద్దగా లేకపోయినా.. ఈజీగా బ్రేక్ ఈవెన్లు అవుతుంటాయి. ఇప్పటికే ఎన్నో సార్లు అది రుజువైంది కూడా. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు ఆరేడు నెలల ముందే దసరా, సంక్రాంతి వంటి పండగలపై ఖర్చీఫ్‌లు వేసుకుంటుంటారు. ఇక మీడియం బడ్జెట్ సినిమాలు ఉగాది, వినాయక చవితి, దీపావళి వంటి పండగలను టార్గెట్‌గా పెట్టుకుంటాయి. అయితే ఈ ఏడాది వినాయక చవితికి అనూహ్యంగా ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కావడం లేదు.
నిజానికి ఈ సారి వినాయక చవితి సినిమా రిలీజ్‌లకు పుష్కలంగా కలిసొచ్చింది. ఎందుకంటే వినాయక చవితి ఈ సారి సోమవారం వస్తుంది. అంటే వీకెండ్‌తో కలుపుని మొత్తం మూడు హాలీడేస్ వస్తున్నాయి. నిజానికి ఇది చాలా మంచి వీకెండ్. సినిమా కాస్త పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మోత మోగిపోయే చాన్స్ ఉంటుంది. కానీ ఇంత మంచి అవకాశాన్ని తెలుగు సినిమాలు మిస్ చేసుకున్నాయి. ముందుగా స్కంద ఈ లాంగ్ వీకెండ్‌పైనే ఖర్చీఫ్ వేసింది. కానీ అనూహ్యంగా సలార్ పోస్ట్ పోన్ అవడంతో సెప్టెంబర్ 28న వస్తుంది. దాంతో చంద్రముఖి-2, మార్క్ ఆంటోని వంటి అరవ సినిమాలు మాత్రమే రిలీజవుతున్నాయి.
అందులోనూ చంద్రముఖి-2 సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. దాంతో వినాయక చవితికి రావడం కష్టమే అని చెన్నై టాక్. అంటే ఈ సారి వినాయక చవితికి కేవలం మార్క్ ఆంటోని సినిమా మాత్రమే రిలీజవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. అదే రేంజ్లో సినిమా ఉంటే మాత్రం విశాల్ ఈ సారి భారీ రేంజ్ హిట్టు కొట్టడం ఖాయం. ఇదే జరిగితే మట్టుకు తెలుగు మేకర్స్ మాత్రం భారీ మూల్యం చెల్లించుకున్నట్లే. అసలింత మంచి లాంగ్ వీకెండ్‌ను మనవాళ్లు ఎలా మిస్ చేసుకున్నారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నిన్న రిలీజైన మిస్ శెట్టి, జవాన్ సినిమాలకు కూడా వినాయక చవితి బాగానే కలిసొచ్చే చాన్స్ ఉంది. ఎలాగూ ఈ మధ్యలో మంచి హైప్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. దాంతో ఈ రెండు సినిమాలకు బాగా కలిసొస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

