అప్పుడే నటుడిగా సక్సెస్ అయినట్లు!

నటుడిగా, దర్శకరచయితగా బహుముఖప్రజ్ఞతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నారు శ్రీనివాస్ అవసరాల. కొత్తదనంతో కూడుకున్న కథల్ని ఎంచుకుంటూ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. విద్యాసాగర్ దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు క్రిష్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ అవసరాల గురువారం పాత్రికేయులతో సంభాషించారు.
ఆ సినిమాకు పూర్తి భిన్నం
హిందీలో వచ్చిన ‘బాల’ చిత్రాన్ని ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. వాస్తవానికి ఆ సినిమా కంటే ముందే 2019 అక్టోబర్‌లోనే మా ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. రెండు సినిమాల్లో చర్చించింది ఒకటే పాయింట్ కాబట్టి ఆ సినిమా రిలీజ్ సమయంలోనే మాదీ విడుదల చేద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. ఏప్రిల్‌లో అంతా సిద్ధమైన సమయానికి లాక్డౌన్ విధించారు. దాంతో విడుదల ఆలస్యమైంది. ‘బాల’ చిత్రాన్ని చూశాను. రెండు సినిమాల్లో అంతర్లీనంగా ఉండే అంశం ఒకటే అయినా కథ, కథనాలు మాత్రం పూర్తి భిన్నంగా అనిపిస్తాయి. తొలుత ఈ చిత్రానికి ‘అందమే ఆనందం’ అనే టైటిల్ అనుకున్నా. క్రిష్‌గారి సూచనతో ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే పేరు ఖరారు చేశాం.
బలమైన పాయింట్ చెప్పాం
మన సమాజంలో బాడీషేమింగ్ (శారీరక రూపహేళన) చేయడం సాధారణంగా కనిపిస్తుంటుంది. రోజువారి వ్యవహారాల్లో దానినొక వినోద అంశంగా చూస్తారు. శరీరపు రంగు, ఎత్తు, బట్టతల గురించి హేళనగా మాట్లాడటం చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ బాడీషేమింగ్‌ను కొంత మంది సరదాగా తీసుకున్నా చాలా మంది ఆత్మన్యూనతాభావానికి గురవుతారు. వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలైనా ఆమోదయోగ్యం అనిపించుకోవు. వెండితెరపై ఈ పాయింట్‌ను చెప్పాలని భావించా. క్రిష్‌గారికి చెపితే కాన్సెప్ట్ బాగుందన్నారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది.
ఇమేజ్‌కు పరిమితమైపోను
ఈ సినిమాలో భావోద్వేగాలతో పాటు చక్కటి వినోదం ఉంటుంది. శారీరక వైకల్యాల్ని చూసి అవహేళన చేయొద్దనే బలమైన అంశాన్ని సినిమాలో చూపించాం. లోపాలతో బాధపడుతున్న వారిపట్ల సహృదయంతో ఉండాలనే సందేశాన్నందించాం. ఈ సినిమా వల్ల ప్రజల ఆలోచనాదృక్పథంలో ఏమైనా మార్పు వస్తే నటుడిగా సక్సెస్ అయినట్లేనని భావిస్తా. సినిమాలపరంగా ఏదో ఒక ఇమేజ్‌కు పరిమితమైపోవడం నాకు ఇష్టం లేదు. నటుడిగా నాలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించాలనుకుంటున్నా. అందుకే నవ్యమైన కథల్ని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నా. నటన, దర్శకత్వం కంటే రచననే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అందులోనే సంతృప్తి దొరుకుతుంది. ఇక దర్శకుడిగా ఎమోషన్, కామెడీ కలబోసిన కథల్నే తీస్తాను. హింస అస్సలు ఇష్టం ఉండదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

