Payal Rajput Interview | ఇండియాలో ఎవరూ ఇలాంటి సినిమా ప్రయత్నించలేదు.. మంగళవారంపై పాయల్ రాజ్‌పుత్
Payal Rajput Interview | ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్లో ఫీ మేల్ ఓరియెంటెడ్ స్టోరీతో వస్తోన్న మంగళవారం (Mangalavaaram) నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను మీడియాతో షేర్ చేసుకుంది పాయల్ రాజ్‌పుత్.
Payal Rajput Interview | ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం మంగళవారం (Mangalavaaram). హార్రర్ కామెడీ జోనర్లో ఫీ మేల్ ఓరియెంటెడ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడు పెంచింది పాయల్ రాజ్‌పుత్ అండ్ టీం. ఈ సందర్భంగా సినిమా విశేషాలను మీడియాతో షేర్ చేసుకుంది పాయల్ రాజ్‌పుత్.
మంగళవారం విశేషాలు పాయల్ మాటల్లోనే..
అజయ్ భూపతితో మీ రెండో సినిమా ఇది.. సినిమా ఎలా మొదలైంది..?
అతడి నుంచి మరో అవకాశం కావాలనుకున్నా. నాకు మంచి పాత్ర దొరికినప్పుడు మాత్రమే మరో అవకాశం ఇస్తానని అజయ్ భూపతి నాతో అన్నారు. నన్ను చిన్న పాత్రల్లో చూపించాలనుకోవడం లేదు.. ఈ విషయంలో అజయ్ క్లారిటీగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ రూట్‌ను మార్చే సినిమా కానుంది. నాకు ఓ వైపు ఎక్జయిటింగ్‌గా, మరోవైపు నర్వస్‌గా ఉంది. ఇండియాలో ఎవరూ ఇలాంటి పాత్రను, కథతో సినిమా తీసే ప్రయత్నం చేయలేదు.
మీరు నెగెటివ్ రోల్ చేస్తున్నారా..? కథ విన్నపుడు మీ ఆలోచన ఏంటీ..?
కాదు.. శైలు పాత్ర విలనిజానికి దూరంగా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత శైలుపై మీరు సానుభూతి చూపిస్తారు.. చాలా భావోద్వేగపూరిత క్షణాలు ఇమిడి ఉంటాయి. ఇంటెన్స్ రోల్స్‌లో నటించా. కానీ ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. కథ విన్న తర్వాత అజయ్ భూపతితో మరో సినిమా చేస్తున్నానని అమ్మకు చెప్పా.
అజయ్ భూపతి 35-40 అమ్మాయిలను ఆడిషన్ చేసి.. మిమ్మల్నే ఫైనల్ చేయడంపై ఎలా ఫీలవుతున్నారు..?
ఆడిషన్స్ గురించి తెలుసుకొని డైరెక్టర్‌కు ఫోన్ చేశా. ఎందుకు తనను తీసుకోవడం లేదని అడిగాను. అజయ్ భూపతి డైరెక్టోరియల్ స్కిల్స్‌పై పూర్తి నమ్మకముండటంతో ఆయనతో సినిమా చేయాలనుకున్నా.
రియల్ లైఫ్‌లో మోడ్రన్‌గా కనిపిస్తారు.. సినిమాలో గ్రామీణ యువతిగా నటించా.. శైలు పాత్రలోకి ఎలా మారారు..?
శైలు పాత్ర హెయిర్, మేకప్ కోసం ప్రతీ రోజు రెండు గంటలు సమయం పట్టేది. షూటింగ్ తర్వాత పాత్రలో నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టేంది. శైలు నా మైండ్‌లో 15 రోజుల పాటు ఉండిపోయింది. నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు ఆమెతోనే ఉన్నా.
ఫీ మేల్ ఓరియెంటెడ్ సినిమా.. ఫీమేల్ ప్రొడ్యూసర్.. ఎలా అనిపిస్తుంది..?
చాలా సౌకర్యవంతంగా ఫీలయ్యా. స్వాతి రెడ్డి చాలా లీనమైపోయే వ్యక్తి. సురేశ్ వర్మతో కలిసి ప్రతీ నిమిషం చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన సంగీతం అందించాడు. టాలెంటెడ్ టెక్నీషియన్స్ సినిమాకు పనిచేశారు. ఇండియన్ సినిమాలో ఇదివరకెన్నడూ చూడని కథను, పాత్రలను మంగళవారంలో చూస్తారు.
గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
షూటింగ్ అప్డేట్..
It’s a WRAP for 99 Days of shoot loaded with never-before visuals in #Mangalavaaram 💥https://t.co/K7IbaWerDk
Hold your breath! Goosebumps loading🔥#Chevvaikizhamai #Chovvazhcha @DirAjayBhupathi @starlingpayal @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati… pic.twitter.com/EI5LO9xfuz
— BA Raju’s Team (@baraju_SuperHit) June 13, 2023
నాలుగు భాషల్లో మంగళవారం టైటిల్ పోస్టర్..
Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋
It's a PAN-SOUTH INDIAN movie🔥
'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

