SPY | స్పై, డెవిల్ సినిమాలకు ఎలాంటి కనెక్షన్ ఉండదు : నిఖిల్
SPY | టాలీవుడ్ యువ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం స్పై (SPY). స్పై ప్రమోషనల్ ఈవెంట్లో నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. స్పై ఇప్పటివరకు చర్చించని యూనిక్ స్టోరీలైన్ అని అన్నాడు.
SPY | టాలీవుడ్ యువ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం స్పై (SPY). ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్‌తో చెప్పేశాడు. స్పై ప్రమోషనల్ ఈవెంట్లో నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. స్పై ఇప్పటివరకు చర్చించని యూనిక్ స్టోరీలైన్ అని అన్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి పీరియాడిక్ స్పై థ్రిల్లర్ జోనర్లో కల్యాణ్ రామ్ నటిస్తోన్న డెవిల్ (Devil – The British Secret Agent) సినిమాతో ఎలాంటి కనెక్షన్ ఉండబోదు. స్పై, డెవిల్ రెండు డిఫరెంట్ స్టోరీలైన్స్ అని చెప్పుకొచ్చాడు.
పాన్ ఇండియన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న స్పై చిత్రంలో ఆర్యన్ రాజేశ్, అభినవ్ గోమాటం, రవి వర్మ, మకరంద్ దేశ్ పాండే ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ (Ed Entertainments) బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. స్పై మూవీలో ఐశ్వర్యా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి కే రాజశేఖర్ రెడ్డి స్టోరీ కూడా అందిస్తున్నాడు.
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) నవీన్ మేడారం దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం డెవిల్ (Devil – The British Secret Agent). హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న డెవిల్కు శ్రీకాంత్ విస్సా కథనందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన డెవిల్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నిఖిల్ స్పై టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

