లంగావోణీ తర్వాత అంతే అందంగా మరింత ఫ్యాషనబుల్‌గా కనిపించే డ్రెస్ క్రాప్‌టాప్. అదే వస్త్రధారణలో సౌందర్యానికే చిరునామాలా కనిపిస్తున్నది కథానాయిక నివేదా పేతురాజ్. పసుపు రంగు లెహెంగాకు ఎరుపు రంగు ఓణీ, ఎరుపూ నీలం వన్నెల కలబోతగా వచ్చిన టాప్ ఇంపైన వర్ణాల మేళవింపుగా మురిపిస్తున్నాయి. పూసలూ, చమ్కీలతో చేసిన వర్క్ దుస్తుల అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది. ట్రెండీగా ఉంటూనే ట్రెడిషనల్ లుక్‌ని తీసుకొచ్చేలా సిల్వర్ బుట్టలూ, ముత్యాల బ్రేస్‌లెట్‌తో ముచ్చటగా ముస్తాబై కుర్రకారుకు ధమ్కీ ఇస్తున్నది ‘దాస్ కా ధమ్కీ’ ముద్దుగుమ్మ!
సి.ఎం. ప్రవీణ్