Nivetha Pethuraj | ‘సినిమా ఆఫర్లు రాకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా’ :నివేథా పేతురాజ్
Nivetha Pethuraj | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సినీరంగలో దూసుకుపోతున్న నటి నివేథా పేతురాజ్. విష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ చిత్రంతో నివేథా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘చిత్ర లహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. నివేథా మొదటి నుంచే నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వస్తుంది. ఇటీవలే ‘బ్లడ్ మేరి’ వంటి వినూత్న కథతో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయం ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్‌పై స్పందిస్తూ పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది.
నివేథా తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ‘హీరోయిన్ కన్నా నటిగా అనిపించుకోవడం గర్వంగా ఉంటుందని తెలిపింది. హీరోయిన్గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు ఆ భయం లేదు. నేనెలాంటి బౌండరీస్ పెట్టుకోలేదు. నటనకు ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెళ్ళడించింది. ఇక సినిమా ఆఫర్లు రాకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా’ అని తెలిపింది. నివేథా ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’లో కీలకపాత్రలో నటించింది. దీనితో పాటుగా తమిళ్లో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- nivethapethuraj
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

