Kumari Srimathi | హిలేరియస్‌గా నిత్యామీనన్ ‘కుమారి శ్రీమతి’ టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nithya Menen | ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది.
Nithya Menen | ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. ‘భీమ్లానాయక్’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం నిత్యామీనన్ చేతిలో రెండు సినిమాలు. ఒక వెబ్ సిరీస్ ఉంది. అందులో లేడి ఓరియెంట్ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’(Kumari Srimathi). గోమతేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు. ప్రముఖ నటి కీర్తి సురేష్ ఈ టీజర్ ను ఆవిష్కరించింది.
”అమ్మ సిరి అది నీకన్నా చాలా చిన్న పిల్ల దానికి పెళ్లి అయిపోయింది. నువ్వెప్పుడు పప్పన్నం పెడతావ్ అంటూ టీజర్ మొదలైంది. ఇక మొదటి డైలాగ్‌లోనే వెబ్ సిరీస్ సిరి పెళ్లి గురించి అని దర్శకుడు హింట్ ఇచ్చారు. పెళ్లి గురించి అందరూ ఒత్తిడి చేస్తున్నా.. పెళ్లి బంధంలో చిక్కుకోకుండా.. స్వంత కాళ్లపై నిలబడి బిజినెస్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఇంటిల్లిపాదిని సంతోషంగా చూసుకోవాలనే లక్ష్యం ఉన్న ఒక వీర వనిత పాత్రలో నిత్య కనిపిస్తుంది. ఇక ఆద్యంతం ఫన్నీగా సాగిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఎవరీ కుమారి శ్రీమతి?
குமாரி ஶ்ரீமதி யாரு?
ഈ കുമാരി ശ്രീമതി ആരാണ്?
कौन है ये कुमारी श्रीमती?Here’s the teaser of #KumariSrimathi: https://t.co/19LUoqdBIr
Streaming from September 28th on @PrimeVideoIN.@MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye @iamThiruveer @PatnaikPraneeta… pic.twitter.com/2YMffKzqRm
— Vamsi Kaka (@vamsikaka) September 20, 2023
ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 28 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అవసరాల శ్రీనివాస్ ఈ వెబ్ సిరీస్‌కు కథను అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

