Nithay Menen | నిత్యామీనన్ పెళ్లి.. ఈ అంశం గురించి రెండుమూడేళ్లుగా ఎవరికి తోచినట్టు వాళ్లు రాసుకుంటూనేవున్నారు. కానీ నిత్యా మాత్రం మౌనంగానే ఉండిపోయిందిగానీ పెద్దగా సమాధానాలు చెప్పిన సందర్భాలు తక్కువే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాత్రం పెళ్లిపై తనకున్న అభిప్రాయం గురించి వివరంగా చెప్పింది నిత్య. ‘ నేను సంస్కృతిని గౌరవిస్తా. సంప్రదాయబద్ధంగా పెరిగిన అమ్మాయిని. నా గురించి ఏమీ తెలీకుండానే పనిగట్టుకొని నాపై కొందరు దారుణమైన రాతలు రాశారు.
అప్పుడు నిజంగా బాధపడ్డా. చివరికి నా పెళ్లి విషయంలోనూ చాలా రూమర్లు వచ్చాయి. కొందరైతే పెళ్లి జరిగిపోయిందని కూడా రాసేశారు. ప్రోగ్రామ్స్ కూడా టెలికాస్ట్ చేశారు. వాటిని చూసి ఎంజాయ్ చేశాను తప్ప సీరియస్గా తీసుకోలేదు. తీసుకోను కూడా. నిజానికి పెళ్లి అనే అంశంపై నాకు ఖచ్ఛితమైన అభిప్రాయం ఉంది. స్థిరమైన ఆలోచనలూ ఉన్నాయి. పెళ్లి అనేది స్త్రీపురుషులిద్దరికీ ఆర్థికపరమైన భరోసా ఇవ్వాలనేది కొందరి అభిప్రాయం. నా వరకూ అది అక్కర్లేదు. సామాజిక భద్రత కావాలి. అలాంటి భరోసా ఇచ్చే అబ్బాయి దొరికితే తప్పకుండా చేసుకుంటా’ అంటూ మనసును ఆవిష్కరించింది నిత్యామీనన్.