అందుకే పెళ్లికి దూరం!
తన జీవితంలో విఫలప్రేమ జ్ఞాపకాలున్నాయని, అందుకే పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయానని చెప్పింది అగ్ర కథానాయిక నిత్యామీనన్. అభినయప్రధాన పాత్రల ద్వారా దక్షిణాదిలో ఈ భామ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సార్ మేడమ్' త్వరలో విడుదలకు సిద్దమవుతున్నది.
తన జీవితంలో విఫలప్రేమ జ్ఞాపకాలున్నాయని, అందుకే పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయానని చెప్పింది అగ్ర కథానాయిక నిత్యామీనన్. అభినయప్రధాన పాత్రల ద్వారా దక్షిణాదిలో ఈ భామ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సార్ మేడమ్’ త్వరలో విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి నిర్మొహమాటంగా తన మనసులో మాటల్ని బయటపెట్టింది నిత్యామీనన్. గత ప్రేమబంధాలన్నీ విఫలమై మనోవేదనను మిగిల్చాయని, వాటి నుంచి తాను పాఠాలు నేర్చుకున్నానని చెప్పింది.
‘యుక్త వయసులో ఉన్నప్పుడు సోల్మేట్ తప్పకుండా అవసరమనే భావనతో ఉండేదాన్ని. అతని కోసం అన్వేషించిన సందర్భాలున్నాయి. కానీ జీవితప్రయాణంలో నా అభిప్రాయాలు మారాయి. పెళ్లనేది కేవలం ఓ ఎంపిక మాత్రమేనని, తప్పనిసరి అవసరం కాదని అర్థం చేసుకున్నా. పెళ్లయితే అది చాలా గొప్ప విషయం, ఒకవేళ కాకున్నా అదీ గొప్ప విషయమే. తోడులేదని కాస్త బాధగా ఉన్నా స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రతన్టాటా కూడా వివాహం చేసుకోలేదు. అయినా ఆయన జీవితంలో ఎన్నో విజయాలున్నాయి. ఏది జరిగినా అంతా మంచికే అనుకొని ముందుకుసాగాలి’ అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

