Nithiin | నితిన్-వెంకీ కుడుముల కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్..!
Nithiin | హిట్టయిన కాంబోలో మరో సినిమా వస్తుందంటే ఆ ప్రాజెక్ట్‌పై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. ఈ సారి మరెన్ని రికార్డులు కొల్లగొడుతారో.. బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో కలెక్షన్ల వరద పారిస్తారో అని ఇప్పటినుంచే ఫలానా అంచనాలు వేస్తుంటారు.
Nithiin | హిట్టయిన కాంబోలో మరో సినిమా వస్తుందంటే ఆ ప్రాజెక్ట్‌పై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. ఈ సారి మరెన్ని రికార్డులు కొల్లగొడుతారో.. బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో కలెక్షన్ల వరద పారిస్తారో అని ఇప్పటినుంచే ఫలానా అంచనాలు వేస్తుంటారు. ప్రస్తుతం అదే క్రేజ్ ఉన్న కాంబో నితిన్-వెంకీ కుడుముల కాంబో. మూడేళ్ల క్రితం భీష్మ సినిమాతో కోట్లు కొల్లగొట్టిన ఈ కాంబో మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా టైటిల్‌ను దీపావళికి రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఓ చిన్న గ్లింప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి కామెడీతో పాటు కాస్త అడ్వేంచర్ ను కూడా వెంకీ కుడుముల యాడ్ చేశాడట. అడ్వేంచర్ కోసం సరికొత్త లోకేషన్ల వేటను షురూ చేశారట. ముందుగా రష్మికను హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు చెప్పగా.. పలు కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. రష్మిక ప్లేస్‌లో శ్రీలీల వచ్చింది. ఇక ఈ సినిమాకు జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీతో ఎక్స్ట్రార్డినరీ అనే ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ముందుగా ఈ సినిమాను క్రిస్మస్ వీక్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. సలార్ రావడంతో తేదీని మార్చుకుంది. ఎప్పుడు రిలీజవుతుందా అన్ని క్లారిటీ ఇంకా రాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

