Macherla Niyojakavargam | ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Macherla Niyojakavargam Pre-Release Event | యంగ్ హీరో నితిన్ ప్రాధాన పాత్రలో నటిస్తున్న లెటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే నితిన్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి యాక్షన్ రోల్‌ను పోషించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలకు క్రియేట్ చేశాయి యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుక డేట్‌ను అనౌన్స్ చేశారు.
‘మాచర్ల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 7న హైదరాబాద్‌లో జరుపనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే గుంటూరులో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జరిపిన విషయం తెలిసిందే. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో క్యాథెరీన్ థెరిస్సా కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు. సినిమాటోగ్రఫి: ప్రసాద్ మూరెళ్ళ.
Assemble for the Much Exciting Mass Celebrations! 🙌🏻🤩#MacherlaNiyojakavargam
Pre Release Event @ Hyderabad on August 7th, 6PM onwards! 🤙🏻😎#MNVFromAug12th 🔥@actor_nithiin @IamKrithiShetty @SrSekkhar @SreshthMovies #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/8a7ieP7qBC— Sreshth Movies (@SreshthMovies) August 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

